calender_icon.png 10 January, 2026 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తూనికలు కొలతల శాఖ దాడులు

05-01-2026 12:00:00 AM

14 మంది కేసులు నమోదు 

ఖమ్మం, జనవరి 4 (విజయక్రాంతి): ఖమ్మంలో ఆదివారం తూనికలు కొలతల శాఖ పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. బైపాస్ రోడ్డు, త్రిటౌన్, ప్రాంతంలో చేపల విక్రయ వ్యాపారుల దగ్గర ఉపయోగించే తూనికల రాళ్లలో మోసాలు చేస్తున్న వారిపై అందిన ఫిర్యాదుల మేరకు 14 కేసులు నమోదు చేశారు.

కిలో తూనికలో 250 గ్రాముల వరకు తక్కువ ఉండటం గమనించి కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో జిల్లా లీగల్ మెట్రోలాజి అధికారి బి ప్రవీణ్ కుమార్, సిబ్బంది  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండి మోసాలకు అరికట్టడంలో లీగల్ మెట్రాలజీ శాఖకు సహకరిం చాలని కోరారు.