26 August, 2026 | 2:26 AM

మానోపాడ్‌లో రైల్వే రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలి

26-08-2026 12:00 AM

అలంపూర్ ఆగస్టు 25: మానవపాడు శివారులోని ఎల్సీ నం.119 ఈ గేట్ సమీపంలో రైల్వే రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలని రైతు సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు కోరారు. ఈ మేరకు మంగళవారం కర్నూలు పట్టణంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుని కలిసి వినతిపత్రం అందజేశారు. డబుల్ ట్రాక్ పనుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్ భవనం తొలగించే అవకాశం ఉండటంతో మానోపాడ్, పరిసర గ్రామాల ప్రజలకు రైలు ప్రయాణ సౌకర్యం దూరమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.

ప్రజల రవాణా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎల్సీ 119ఈ సమీపంలో రైల్వే స్టాప్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఇట్టి అంశంపై ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు సానుకూలంగా స్పందించి సంబంధిత రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి రైల్వే స్టాప్ ఏర్పాటు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కలిసిన వారిలో దామోదర్ రెడ్డి,గొల్ల వెంకట్రాముడు, జగ్గుల శివ, తిక్కన్న, మట్టిలేటి తదితరులు ఉన్నారు