22-ఏ భూముల సమస్యపై భూబాధితుల ర్యాలీ
నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించి బాధితులకు న్యాయం చేయాలి
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): 22-A నిషేధిత జాబితాలో చేర్చిన భూములను వెంటనే తొలగించి భూ బాధితులకు న్యాయం చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshma Reddy) డిమాండ్ చేశారు. ఈ మేరకు మల్లాపూర్ శివ హోటల్ వద్ద భూ బాధితులు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, 22-A నిబంధనల కారణంగా అనేక మంది ప్రజలు తమ సొంత భూములను విక్రయించలేక, రిజిస్ట్రేషన్ చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అర్హత కలిగిన భూములను 22-A నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రజల ఆస్తి హక్కులను పరిరక్షించాలని, భూ బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్, శ్రీనివాస్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, భూ బాధితులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాంనగర్ చౌరస్తాలో..
ముషీరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): 22ఏ ఆంక్షల వల్ల పేద, సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ పేర్కొన్నారు. గురువారం రాంనగర్ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్య పాలనపై 22ఏ కు వ్యతిరేకంగా రాంనగర్ చౌరస్తాలో అడిక్మెట్ డివిజన్ బీఆర్‌ఎస్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కె. మాధవ్ సభకు అధ్యక్షత వహిం చగా ముఖ్య అతిథిగా హాజరైన ముఠా జైసింహ మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 22ఏను ఆంక్షలను అడ్డం పెట్టుకొని ప్రజల నుంచి 30శాతం అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
చట్టబద్దంగా కొనుగోలు చేసిన కొన్ని ప్రైవేట్ భూములు, ప్లాట్, ఇండ్ల స్థలాలు 22ఏ జాబితాలో చేర్చడం వల్ల స్థల యజమానులు వాటిని విక్రయించలేక, రిజస్ట్రేషన్ చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి వంద రోజుల్లో వాటిని అమలు చేస్తామని మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ప్రజలను మాయమాటలతో మోసం చేస్తున్నదన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ అడిక్మెట్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్, నియోజకవర్గం మీడియా సెల్ ఇన్చార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, అడిక్మెడ్ డివిజన్ బీఆర్‌ఎస్ నేతలు శ్యామ్ సుందర్, అస్లం, నేత శ్రీను, పార్టీ సీనియర్ నాయకులు తలారి శ్రీకాంత్ ముదిరాజ్, టి. సోమన్, దీన్ దయాల్ రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, అనురాధ, బొట్టు శ్రీనివాస్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, రేషం మల్లేష్, సిరిగిరి శ్యామ్, ఆర్. మోజేష్, ఐదు డివిజన్ల బీఆర్‌ఎస్ అధ్యక్షులు వై.శ్రీనివాస్ రావు, శ్రీధర్ రెడ్డి, శంకర్ ముదిరాజ్, రాకేష్ కుమార్, వల్లాల శ్యామ్ యాదవ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
బడంగ్‌పేట్‌లో..
రంగారెడ్డి (బడంగ్పేట్), సెప్టెంబరు 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ విఫల పాలనను నిరసిస్తూ బిఆర్‌ఎస్ కేటీఆర్ పిలుపు, సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు బడంగ్పేట్ సర్కిల్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి ఆధ్వర్యంలో గురువారం రెండో రోజు ’పోరు యాత్ర’ నిర్వహించారు. వినాయక మండపం నుండి బాలాపూర్ ఎమ్మార్వో ఆఫీస్ వరకు భారీ ర్యాలీ చేపట్టి, 22A నిషేధిత జాబితా నుండి భూములను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్వోకి వినతిపత్రం ఇచ్చారు.
6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని రాంరెడ్డి విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు సూర్ణగంటి అర్జున్, ఆర్కల కామేష్ రెడ్డి, పెద్దబావి ఆనంద్ రెడ్డి, వంగవీటి లక్ష్మారెడ్డి, భీమిడి జంగారెడ్డి, పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, జెనిగే శ్రీనివాస్ యాదవ్, మర్రి నరసింహారెడ్డి, రఘునాథన్ చారి, గౌర సాయి కుమార్, పుట్టగల సంతోష్ కుమార్, గట్టు మహిపాల్, కర్రే సాయికుమార్, సంబల్ పూర్ బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
22ఏ యూఎల్సీ సమస్యలు పరిష్కరించాలి
రంగారెడ్డి, (నాగోల్) సెప్టెంబరు 3 (విజయక్రాంతి): రాక్టౌన్ కాలనీకి సంబంధించిన 22(ఎ), యూఎల్సీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర వినోద్రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్లు 12, 16లోని 39,067 గజాల భూమి 22(ఎ) జాబితాలో ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ యూఎల్సీ వివరాలు వ్బుసైట్లో తొలగించలేదని, సమస్యలను పరిష్కరించి కాలనీని నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు సహకరించాలని ఎంపీని కోరారు.






