సదరన్ ట్రావెల్స్‌కు అరుదైన గౌరవం
4వ సారి వేట (వీఆటీఏ) అవార్డు
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): సదరన్ ట్రావెల్స్‌కు మోస్ట్ ట్రస్టెడ్ అవుట్‌బాండ్ ట్రావెల్ బ్రాండ్ కేటగిరీలో ప్రతిష్టాత్మకమైన ‘వేట’ (వీఈటీఏ) ట్రావెల్ అవార్డు లభించింది. ఈ అవార్డును ఫిబ్రవరి 24న న్యూఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో అందజేశారు. పర్యాటక రంగం లో వినూత్నత, సేవా నాణ్యత, పరిశ్రమలో నాయకత్వ లక్షణాలను గుర్తించి ప్రదానం చేసే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల్లో వేట ట్రావెల్ అవార్డు ఒకటి.
56 సంవత్సరాలుగా సదరన్ ట్రావెల్స్ 2000కు పైగా దేశీయ, అంతర్జాతీయ హాలిడే ప్యాకేజీలు, కార్పొరేట్ ట్రావెల్ సొల్యూషన్స్, కస్టమైజ్డ్ టూర్ సేవలను అందిస్తూ రంగంలో పయనీర్గా నిలిచింది. సదరన్ ట్రావెల్స్ ఎండీ కృష్ణ మో హన్ అలపాటి మాట్లాడుతూ.. వేట ట్రావెల్ అవార్డు అందుకోవడం తమకు గర్వంగా ఉన్నదన్నారు.




