26 February, 2026 | 3:20 AM

శ్రీలంకలో విశ్వజన కళామండలి స్వర్ణోత్సవ వేడుకలు

26-02-2026 01:35 AM

విశ్వజన కళామండలి సంస్థ జాతీయ అధ్యక్షుడు జీ మాష్టార్జీ

ముషీరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): విశ్వజన కళామండలి సంస్థ 50 ఏండ్లలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సంస్థ ప్రారంభ స్వర్ణోత్సవ వేడుకలను శ్రీలంకలోని కొలంబో రాజధాని రాష్ట్రంలో నిర్వహిస్తున్నామని, అందుకు గ్లోబల్ ఈవెం ట్స్ సంస్థ ముందుకు వచ్చినట్లు విశ్వజన కళామండలి సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి. మాష్టార్జీ తెలిపారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సంస్థ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కవులు, కళాకారులు, రచయితలకు ఎన్నో సేవలు అందించిందని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన కవులు, కళాకా రులు, సామాజిక కార్యకర్తలకు జీవిత సాఫ ల్య, ప్రతిభా పురస్కారాలు, స్త్రీ శక్తి పురస్కారాలు, యువశక్తి పురస్కారాలు, భాగస్వామ్య పురస్కారాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు సత్యనారాయణ, మహేందర్, నాగేశ్వర్ రావు, అమృత్ కుమార్, నరసింహ రాజు, సుదర్శన్ బాబు, దాసరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.