శ్రీధర్ పెద్దిరెడ్డికి అరుదైన గౌరవం
న్యూయార్క్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సన్మానం
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ ‘రెనోవా ఆంకాలజీ’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ పెద్దిరెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. సామాజిక సేవా రంగంలో ఆయన అందిస్తున్న విశిష్ట సహకారానికి, ముఖ్యంగా ప్రజారోగ్యం, మానవ గౌరవం, లింగ సమానత్వం, పారిశుధ్యం మెరుగుపరచడంలో ఆయన చూపుతున్న నిరంతర కృషికి గుర్తింపుగా న్యూయార్కులోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఆయనను ఘనంగా సన్మానించారు.
ఐక్యరాజ్యసమితి ప్రతినిధి అంబాసిడర్ లూయిస్ సువారెజ్ హెర్నాండెజ్, ఐక్యరాజ్యసమితి గ్లోబల్ పీస్ కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ బర్ఖా వర్షా సమక్షంలో ఈ వేడుక జరిగింది. డాక్టర్ శ్రీధర్ పెద్దిరెడ్డి సామాజిక సేవలు ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నందుకు వారికి ‘సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్’ను అందజేశారు.




