దివ్యాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాలని వినతి
11-05-2024 01:56 AM
మంథని, మే 10: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు వికలాంగుల నెట్‌వర్క్ (ఎన్‌పీడీఓ) పెద్దపల్లి జిల్లా కన్వీనర్ ఇనుముల సతీష్ శుక్రవారం మంథనిలో వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.






