ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయిలో విస్తరించాలి
హైదరాబాద్: ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజల ఆర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజావాణి సేవలను మరింత చేరువ చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని, మండల స్థాయికి ప్రజావాణిని విస్తరించాలన్నారు. ఆర్జీల పురోగతిని అర్జీదారుడికి తెలియజేయాలని, ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువు ఉండాలని ఆయన తెలిపారు. ఆర్జీల నమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి డిజిటల్ ప్లాట్ ఫాం ఉండాలని, ప్రతిస్థాయిలో ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలి. ప్రతి జిల్లా, శాఖలో ప్రత్యేక ప్రజావాణి విభాగాలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే అప్పీల్ వ్యవస్థ తీసుకురావాలని, ప్రజలకు నమ్మకంగా ఉండేలా ప్రజావాణి సేవలు అందించాలని సీఎం ఆదేశించారు.






