26 April, 2026 | 3:34 PM

కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి

11-05-2024 01:54 AM

జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు

జహీరాబాద్, మే 10: బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ప్రజలను కోరారు. శుక్రవారం జహీరాబాద్‌లో బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కు మద్దతుగా పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పదేండ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని విన్నవించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను గ్యారెంటీల పేరుతో మోసం చేసిందని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని చెప్పారు.