calender_icon.png 16 October, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోర్డాన్ దేశంలో కుబీర్ వాసి ఆత్మహత్య

16-10-2025 01:31:39 AM

కుబీర్ అక్టోబర్ 15: ఉపాధి కోసం జోర్డాన్ దేశానికి వెళ్లిన నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోన కుట్టి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల రాజు (27) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్టు గ్రామస్తులు తెలిపారు. నెల రోజుల క్రితం ఉపాధి కోసం వెళ్లిన ఆయన అక్కడ పనిచేస్తుండగా మంగళవారం సాయంత్రం భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు ఇక్కడి ఎన్నారై అధికా రులకు సమాచారం అందించడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన ట్లు తెలిపారు.

నిర్మల్ జిల్లాకు చెందిన ప్రవాస మిత్ర లేబర్ యూనియన్ ఎన్నారై సభ్యులు స్వదేశీ పరికిపండ్ల అక్కడి రాయబార అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు