16-10-2025 01:29:07 AM
-దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఎస్పీ అఖిల్ మహాజన్
-ఆదివాసీలతో కలిసి ఉత్సాహంగా గుస్సాడీ నృత్యాలు..
ఆదిలాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : అడవుల జిల్లా... ఆదివాసీల ఖీల్లా .. అయి నా ఆదిలాబాద్ జిల్లాలో దీపావళి పండగ సమీపిస్తుందంటే చాలు ఆదివాసి గూడాల్లో దండారి ఉత్సవాల సందడి నెలకొంది. ఇందులో భాగంగానే బుధవారం భీంపూర్ మండలం భగవాన్ పూర్ నిర్వహించిన దం డారి ఉత్సవంలోఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన ఎస్పీకి ఆదివాసీలు సాంప్రదాయ డప్పు వాయిద్యాల నడుమ గుస్సాడి నృత్యాలతో ఆహ్వానాన్ని పలికారు.
ఈ సందర్భంగా ఎస్పీ నెమలి పింఛం టోపీలు ధరించి ఆదివాసీల తో కలిసి ఉత్సాహంగా గుస్సాడి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... ఆదివాసీలది ప్రపంచంలోనే అత్యంత విభిన్న సంస్కృతి కలిగిన సాంప్రదాయమని పేర్కొన్నారు. తన సంస్కృ తి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఉన్నత విద్యను అభ్యసించి భావితరాలకు తమ సాంప్రదాయాలను తెలియజేసే విధంగా అభివృద్ధిని సాధించాలని సూచించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ విద్య, ఉపాధి వ్యవసాయం రంగాలలో ఉన్నత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
ముఖ్యంగా యువతకు, పిల్లలకు చదువు పట్ల ప్రాధాన్యతను తెలియజేసి విద్యకు మొదటి ప్రాధాన్యతను కేటాయించాలని తెలిపారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాల ని, గంజాయి లాంటి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జిల్లా పోలీసులతో కలిసి పోరాడాలని సూచించారు. అదేవిధంగా జిల్లా పోలీసుల తరఫున 24 గంటలు ఏ లాంటి అత్యవసర సమయంలోనైనా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి, జైనథ్ సిఐ శ్రావణ్, భీంపూర్ ఎస్‌ఐ విక్రమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.