calender_icon.png 16 October, 2025 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురుగుల మందు తాగి ముగ్గురు మృతి

16-10-2025 01:32:41 AM

మంచిర్యాల, అక్టోబర్ 15(విజయక్రాంతి) : మంచిర్యాల పట్టణంలో రాజీవ్‌నగర్ నివాస ముంటున్న ఒక కుటుంబం ఈ నెల 5వ తేదీన పురుగుల మందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మంచిర్యాల పట్టణ సిఐ ప్రమోద్‌రావు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకా రం... ఈనెల 5న రాజీవ్‌నగర్‌లో నివాసముం టున్న చక్రవర్తికి భార్య దివ్య, కుమార్తె దీక్షిత (10), కొడుకు పవన్ (12)లు ఉన్నారు.

కొడు కు పవన్ రెండు నెలల కిందట జ్వరంతో మర ణించగా కుటుంబ సభ్యులు మానసికంగా కృంగి పోయారు. ఐదవ తేదిన కొడుకు పుట్టి న రోజు సందర్భంగా కేక్ కట్ చేసిన కుటుంబ సభ్యులు కొడుకు లేని బాధ భరించలేక పురు గుల మందు తాగి ఆత్మహత్యకి పాల్పడ్డారు.

పక్కనే నివాసముంటున్న చక్రవర్తి తమ్ముడు ఓంకార్ అక్కడికి వెళ్లి చూడగా అన్నా, వదిన లు కింద పడి ఉండగా, దీక్షిత వాంతులు చేసు కోవడాన్ని గమనించి వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైనవై ద్యం చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూఈ నెల9న  దీక్షిత, 11న దివ్య మరణించింది. బుధవారం చక్రవర్తి సైతం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.