26 May, 2026 | 1:00 AM

నరకానికి రోడ్డు!?

26-05-2026 12:00 AM
  1. గుంతల రహదారితో నరకయాతన
  2. సలగుపల్లి -పెంచికల్పేట్ మార్గంలో అవస్థలు 
  3. అటవీఅనుమతుల పేరుతో కాలయాపన
  4. రోడ్డు ఎప్పుడు వేస్తారంటూ ప్రయాణికుల ఆగ్రహం

బెజ్జూర్ , మే 25(విజయ క్రాంతి):మండలంలోని సలగుపల్లి ఇండియన్ పెట్రోల్ బం క్ నుంచి పెంచికల్పేట్ వరకు ఉన్న ప్రధాన రహదారి అడుగడుగునా గుంతలతో దారు ణ స్థితికి చేరుకుంది.రహదారి అంతా గుంతలమయంగా మారడంతో బస్సులు, ఆటో లు, ఇతర వాహనాల రాకపోకలు తీవ్ర ఇ బ్బందులకు గురవుతున్నాయి. తరచూ వా హనాలు చెడిపోవడంతో వాహనదారులు ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గుంతల్లో నీరు నిలిచి వాటి లోతు తెలియక ప్రమాదాలు జరిగే అవకాశం ఉం దని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయా ణించడం ప్రమాదకరంగా మారిందని చెబుతున్నారు.గుంతల రహదారిపై బస్సులు ప్ర యాణించే సమయంలో తీవ్ర కుదుపులకు గురవుతున్నామని, నడుము నొప్పులు, ఒళ్లునొప్పులు, ఇతర అనారోగ్య సమస్యలతో బా ధపడుతున్నవారికి ఈ ప్రయాణం మరింత కష్టసాధ్యంగా మారుతోందని ప్రయాణికు లు వాపోతున్నారు.

కొందరు ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయని పేర్కొంటున్నారు.అటవీ శాఖ అను మతులు రాకపోవడంతో శాశ్వత రహదారి నిర్మాణం ఆలస్యమవుతోందని, అప్పుడప్పుడు చేపడుతున్న తాత్కాలిక మరమ్మ తులు సమస్యకు పరిష్కారం కావడం లేదని ప్రజలు చెబుతున్నారు. గత ఏడాది రహదారిలోని గుంతల్లో నీరు నిలవడంతో ఓ ఆర్టీసీ డ్రైవర్ గుంతల్లో చేపలు పట్టి వినూత్నంగా నిరసన వ్యక్తం చేసినా సమస్య మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని గుర్తుచేస్తున్నారు.

ప్రతిరోజూ పదుల సంఖ్యలో బస్సులు, వం దలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. రహదారి దుస్థితి కారణంగా ప్రయాణ సమ యం పెరగడంతో పాటు ప్రమాదాల భ యం వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చే స్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చొరవ తీసుకుని అటవీ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి రహదారి నిర్మాణ పనులు ప్రారంభించాలని వాహనదారులు, ప్రయాణికులు, మండల ప్రజలు కోరుతున్నారు.