24 July, 2026 | 1:07 AM

మున్నాళ్ల ముచ్చటే..!

24-07-2026 12:00 AM

మూడేళ్లకే పెచ్చులూడుతున్న పాలకవీడు కేజీబీవీ భవనం

తూతూ మంత్రంగా నిర్మాణం పనులు?

కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలనీ స్థానికుల వేడుకోలు

పాలకవీడు, జులై 23: ప్రభుత్వం విద్యార్ధుల కోసం సొంత పాఠశాల భవనం నిర్మించి, అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉచితంగా ఉన్నత విద్య కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తుంది. ప్రభుత్వ భవనం పది కాలాలపా టు మన్నికగా ఉండాల్సిన నిర్మాణాలు మూ ణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, గుత్తేదారుల ఇష్టా రాజ్యం వెరసి నిర్మాణ పనుల్లో నాణ్యత లో పం వలన మూణ్ణాళ్ల లోనే భవనాలు పగు ళ్ళు ఏర్పడుతున్నాయి.   

రూ. 3.5 కోట్లతో కేజీబీవీ భవన నిర్మాణం : 

విద్యతోనే అధివృద్ధి సాధ్యమని భావించిన గత ప్రభుత్వం ప్రతి మండలానికి ప్రభు త్వ బాలికల రెసిడెన్సిల్ పాఠశాలలను నిర్మించాలని సదుద్దేశంతో మండలానికి ఒక క స్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల నిర్మాణాలకు ఆదేశించింధి. దానిలో భాగంగానే మే 20, 2021 వ సంవత్సరంలో పాలకవీడు మండల కేంద్రంలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలకు అప్పటి హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి, జిల్లా, మండల ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. 3.50 కోట్ల రూపాయలు వెచ్చించి,  దాదాపుగా రెండున్నర సంవత్సరాలు కట్టుబడి చేసి అక్టోబర్ 5, 2023 న ప్రాంభోత్సవం చేశారు.

ఊడిపోతున్న పెచ్చులు.. కూలిపోతున్న గోడలు !: 

భవన నిర్మాణం జరిగి మూడేళ్లు కూడా కాలేదు. బిల్డింగ్ ఎక్కడ చూసినా పగుళ్ళు, ఊడి పోయిన గోడ పెచ్చులు, కూలిపోతున్న గోడలు, రెండు అంతస్తుల పైన ఉన్న పిట్ట గోడ కూలి క్రింద పడిందనీ స్థానికులు చెబుతున్నారు. నాసిరకం మెటీరియల్ తో త క్కువ సిమెంట్, ఎక్కువ ఇసుకతో నిర్మాణం చేసిన విధానం కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుధని గ్రామస్తులే వివరిస్తున్నారు. గోడ పె చ్చులు ఊడిన దగ్గర వేళుతో రుద్దితే ఇసుక రాలు తున్నది అంటే ఎంత మేర నాసిరకం మెటీరియల్ వాడారో అర్థమవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

నిర్మాణానికి వాడాల్సిన నాణ్యత ప్రమాణాలు

ఇసుక,సిమెంటు,ఇటుక పాటించకపోవడ మే కాకుండా ఎంతో మన్నికతో చేయించాల్సిన పనులను ఇం జనీరింగ్ అధికారులు, గుత్తేదారులు ఇచ్చే పర్సంటేజీలకు కక్కుర్తి పడుతూ నాణ్యతను గాలికొ వదిలేశారని ఆ రోపణలు వినిపిస్తున్నాయి. దీంతో లక్షలాది రూపాయలు బూడిదలు పోశారనే వార్తలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

అధికారుల పర్యవేక్షణ అంతంతే!: 

అభివృద్ధి పనులను దగ్గరుండి ఎంతో మన్నికతో చేయాల్సిన సంబంధించిన అధికారులు పాఠశాల భవనం చేపట్టిన పనుల వద్దకు చుట్టం చూపుగా వచ్చి పోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షలాది రూపాయలతో చేపట్టిన పనులకు గుత్తేదారులు ఇచ్చే పర్సంటేజీలకు కక్కుర్తి పడుతూ పనులను పర్యవేక్షించాల్సింది పోయి ఇటువైపు కన్నెత్తి చూడ లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కుతూ ధనార్జనే ధ్యేయంగా ఆ పనులకు నాణ్యత లేకుం డా కట్టిన కాంట్రాక్టర్ సహకరించిన అధికారులపై కొరడా ఝళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ పలువురు తన మనసులో మాటను బాహటంగానే చెబుతున్నారు.

బాధ్యులపై చర్యలేవి?: 

విద్యార్థులు, స్టాఫ్ అంతా కలిపి దాదాపుగా 350 మంది ఉంటున్న ఈ రెండు అంతస్తుల బిల్డింగ్ ను, కాంట్రాక్టర్ ధనార్జనే ధ్యేయంగా నిబంధనలకు నీళ్లు వదులుతూ నిర్మించిన ఈ భవనం కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు స్థానికులు కోరుతున్నారు. అలాగే నాసిరకం మెటీరియల్ తో నిర్మించిన ఈ నిర్మాణానికి సహకరించిన అధికారులు, ఇంజనీర్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని భవిష్యత్ లో మరెప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుకొంటున్నారు.

సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి 

పాఠశాల భవనం నిర్మించి మూడు సంవత్సరాలు కాలేదు. అప్పుడే పెచ్చు లు ఊడిపడుతున్నాయి. నాసిరకం సి మెంట్, ఇసుక వాడటం వాళ్లే పెచ్చులు ఉడి పడుతున్నాయి. సంబందించిన ఇం జనీర్, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టర్ నుండి బిల్లులు రికవరీ చేయాలి.

రమావత్ నరి నాయక్, బిజెపి మండల అధ్యక్షులు, పాలకవీడు