24 July, 2026 | 1:51 AM

నేడు విద్యాసంస్థల బంద్

24-07-2026 12:37 AM
  1. విద్యావ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన కేంద్రం
  2. ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి
  3. బంద్‌ను విజయవంతం చేయాలని పలు సంఘాల పిలుపు
  4. జేఎన్టీయూ, ఓయూ, టీయూల్లో పరీక్షలు వాయిదా

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ తెలంగాణ వ్యా ప్తంగా నేడు విద్యాసంస్థల బంద్‌కు ఎఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్ యూ, ఎఐఎఫ్‌ఎస్, ఏఐఎస్‌బీ, ఏఐపీఎస్ యూ పలు విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యం లో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జేఎన్టీయూ, ఓయూ, టీయూతోపాటు పలు యూనివర్సిటీల్లో నిర్వహించనున్న పరీక్షలను రద్దు చేస్తు న్నట్లు ఆయా యాజమాన్యాలు, విద్యాసంస్థలు ప్రకటించాయి. వాయిదా వేసిన పరీక్ష లను ఎప్పుడు నిర్వహించనున్నామో తరువాత వెల్లడిస్తామని పేర్కొన్నాయి.

కాగా నేటి బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థు లు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజలు సహకరించా లని ఆయా సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఎఐఎస్‌ఎఫ్ మణికంఠ, పుట్ట లక్ష్మణ్, ఎస్‌ఎఫ్‌ఐ నాగరాజు, ఎన్‌ఎస్‌యూఐ పల్లె మురళీలు సమావేశంలో మాట్లాడారు.