24 July, 2026 | 3:22 AM

ప్రధాని మోదీ బాధ్యత వహించాలి

24-07-2026 02:01 AM

ఎంపీ ప్రియాంక గాంధీ 

న్యూఢిల్లీ, జూలై 23 (విజయక్రాంతి): నీట్ అక్రమాలు, విద్యార్థుల నిరసనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఆయన ‘అంగారక గ్రహానికి వెళ్లిన‘ ఘనతను తన ఖాతాలో వేసుకుంటున్నారని, కాబట్టి ఇప్పుడు ఆయన తన చర్యలకు బాధ్యత వహించాల్సి న సమయం ఆసన్నమైందన్నారు.

పార్లమెం ట్ హౌస్ ప్రాంగణంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి తనకు పిల్లలం టే ఇష్టమని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, కానీ నిన్న రాత్రే వారిపై బాష్పవాయు వు ప్రయోగించి, పోలీసులతో లాఠీచార్జి చేయించడం అమానుషం అన్నారు. ‘అతను బలహీనుడు, పిరికివాడు’ అని పేర్కొన్నారు.