24 July, 2026 | 1:53 AM

యూపీఏలో 53 లీక్‌లు!

24-07-2026 12:40 AM
  1. అప్పటి విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేశారా?
  2. కాంగ్రెస్‌కు పరీక్షల గురించి మాట్లాడే హక్కు లేదు
  3. పేపర్ లీక్‌ల నియంత్రణకు ప్రధాని మోదీ కఠిన చట్టం
  4. దేశంలో అలజడులు సృష్టించేదుకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల కుట్ర
  5. ఇందిరాగాంధీని హత్య చేసిన శక్తులతోనే రాహుల్ స్నేహం 
  6. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు   

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): ‘కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న కాం గ్రెస్ నాయకులు తమ గత చరిత్రను గుర్తుచేసుకోవాలి. 2014కు ముందు యూపీఏ ప్రభు త్వ హయాంలోనూ, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు (టీఎంసీ, డీఎంకే, ఎస్పీ,బీఆర్‌ఎస్ ) పాలించిన రాష్ట్రాల్లో 53 కంటే ఎక్కువ ప్రధాన పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి. 

ఆ సమయం లో కాంగ్రెస్ లేదా బీజేపీయేతర ప్రభుత్వాల విద్యాశాఖ మంత్రులు రాజీనామాలు చేశా రా?’ అని బీజేపీ రాంచందర్‌రావు ప్రశ్నించారు. 2005 నుంచి 2014 వరకు సీబీఎస్ ఈ, ఎయిమ్స్, ఆర్‌ఆర్ బీ, ఎస్‌ఎస్సీ, బ్యాంకిం గ్ వంటి అనేక జాతీయ స్థాయి పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని రాంచందర్‌రావు ఆధారాలతో వివరించారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచా రాన్ని ఆయన గణాంకాలతో తిప్పికొట్టారు.

గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో పరీక్ష పేపర్ లీక్ అయితే నిందితులపై 420 కేసులు నమోదు చేసి వదిలేసేవారని,  మోదీ ప్రభుత్వం 2024లో ప్రివెన్షన్ ఆఫ్ అన్-ఫెయిర్ మీన్స్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ తీసుకువచ్చిందన్నారు. దోషులకు కోటి రూపాయల జరిమానాతో పాటు కఠిన శిక్షలు పడే లా చట్టాన్ని రూపొందించిందన్నారు. అలాగే ప్రొఫెసర్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ’నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ ని బలోపేతం చేసి సంస్కరణలు అమలు చేస్తోందని తెలిపారు.

నీట్ ఎగ్జా మినేషన్ పేపర్ లీకేజీ విషయం తెలిసిన వెంట నే ఎన్డీయే ప్రభుత్వం తక్షణమే  31 మందిని అరెస్ట్ చేసిందని రాంచంరద్‌రావు వెల్లడించారు. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ అనుకూల వ్యక్తులే ప్రశ్న పత్రం లీకేజీకి కారణమని తేలిందన్నారు. విద్యార్థులకు  అన్యాయం జరగకుండా ప్రభుత్వం రీ-ఎగ్జామ్స్ నిర్వహించిందని, ఏ ఒక్క విద్యార్థి కూడా దీనిపై రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలపలేదని పేర్కొన్నారు.  

ఆశాంతిని సృష్టించే కుట్ర 

దేశంలో అశాంతిని సృష్టించి, యువతను రెచ్చగొట్టడం ద్వారా ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్, వామపక్షాలు, విదేశీ విచ్ఛిన్నకర శక్తులు పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నాయని రాంచందర్‌రావు మండిపడ్డారు. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ తరహాలో భారతదేశంలో కూడా అశాంతిని, హింసను సృష్టించేందుకు కొన్ని అల్ట్రా-లెఫ్ట్, సాఫ్ట్-లెఫ్ట్ శక్తులు, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఏఎస్‌ఏ వంటి పాత సంఘాల నాయకులు కొత్త పేర్లతో కాక్రో జనతా పార్టీ వంటి వేదికలను ఏర్పాటు చేస్తున్నారని ఆయ న ఆరోపించారు.

పుణే, ముంబై, హైదరాబాద్, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన కార్యక్రమాల వెనుక ఈ దేశ వ్యతిరేక శక్తుల హస్తం ఉందన్నారు. ఈ ఉద్యమాలకు ఖలిస్తాన్ శక్తుల నుంచి రూ. 10 కోట్లు, కతార్, కెన డా, పాకిస్తాన్,  బంగ్లాదేశ్‌ల నుంచి ఆర్థిక, వ్యూహాత్మక మద్దతు అందుతోందని, అందు కు సంబంధించిన  ఆధారాలతో సహా సంచలన విషయాలు బయటపెట్టారు. ఏ ఖలిస్తానీ శక్తులైతే రాహుల్‌గాంధీ నానమ్మ ఇందిరాగాంధీని పొట్టనబెట్టుకున్నాయో, అదే శక్తులతో రా హుల్‌గాంధీ జతకట్టడం సిగ్గుచేటని విమర్శించారు.

ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో రికార్డ్

2004-2014 మధ్య యూపీఏ ప్రభు త్వం కేవలం 2.9 కోట్ల ఉద్యోగాలు మాత్రమే సృష్టిస్తే, 2014- 2024 మధ్య మోదీ ప్రభుత్వం 17 కోట్ల ఉద్యోగ అవకాశాలను సృష్టించిందని రాంచందర్‌రావు తెలిపారు.  ఎన్డీయే పాలనలో ఇప్పటివరకు 12 లక్షలకు పైగా నియామక పత్రాలు అందజేశామని, 19 రోజ్‌గార్ మేళాల ద్వారా నిరంతరం నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు. 2017--18లో 6 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు 2025 నాటికి 3.1 శాతానికి తగ్గిందని, ఎంప్లాయ్‌మెంట్ రేటు 46.8 శాతం నుండి 57.4 శాతానికి పెరిగిందని ఆయన వెల్లడించారు.

2014 తర్వాత దేశంలో ఐఐటీ, ఐఐఎమ్, ఎయిమ్స్, ఎన్‌ఐటీ,  మెడికల్ కళాశాలల సం ఖ్యను రెట్టింపు చేశామని, ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదు 4.5 కోట్లకు పైగా పెరిగిందని వివరించారు. వికసిత్ భారత్, ముద్రా యోజన, స్టార్టప్ ఇండియా ద్వారా కోట్లాది మంది యువతకు స్వయం ఉపాధి లభించిందన్నారు.

తెలంగాణ యువత దేశానికే కొండంత అండ 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశ వ్యతిరేక శక్తులకు, విదేశీ నిధులతో నడిచే సంఘాలకు మద్దతు ఇవ్వడం మా నుకోవాలని రాంచందర్‌రావు  హెచ్చరించారు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో జరిగిన పరిణామాలను ఇక్కడ పునరావృతం చేయాలని చూస్తే భారతీయ యువత చూస్తూ ఊరు కోదని, వారంతా దేశభక్తితో ప్రధాని మోదీ న  వభారత నిర్మాణంలో భాగస్వాములవుతారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ యువత దేశానికి కొండంత అండగా ఉంటుందన్నారు.