23 April, 2026 | 2:12 AM

యువ జర్నలిస్టులకు ఆదర్శం

23-04-2026 12:54 AM

నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చిన సంపాదకుడు ఎంవీఆర్ శాస్త్రి 

  1. విలువలతో జర్నలిజం వృత్తి సాగించాలనుకునే వారికి స్ఫూర్తి
  2. విజయక్రాంతి’, ‘మెట్రో ఇండియా’ దినపత్రికల చైర్మన్ సీఎల్ రాజం
  3. ఎంవీఆర్ శాస్త్రికి (డబ్ల్యూజేఐ) తెలంగాణ, ఏపీ శాఖల జీవన సాఫల్య పురస్కారం

ఖైరతాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): పాత తరం పాత్రికేయులకే కాకుండా, యువ జర్నలిస్టులకూ ఎంవీఆర్ శాస్త్రి ఆదర్శంగా తీసుకోవాలని ‘విజయక్రాంతి’, ‘మెట్రో ఇండియాదినపత్రికల చైర్మన్ సీఎల్ రాజం పిలుపునిచ్చారు. పత్రికల్లో ప్రజాసమస్యలపై విస్తృ తంగా ఎడిటోరియల్స్ ప్రచురణ జరగాలని ఆకాంక్షించారు. జర్నలిజం గౌరవ మర్యాదలతోపాటు విలువలను పెంపొందించుకోవా లని అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌లోని సోమాజిగూడ కత్రియా హోటల్‌లో బుధవారం వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) తెలంగాణ, ఏపీ శాఖల సం యుక్త ఆధ్వర్యంలో సీనియర్ సంపాదకుడు ఎంవీఆర్ శాస్త్రికి జీవన సాఫల్య పురస్కార ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎల్ రాజం మాట్లాడుతూ.. పాత్రికేయ రంగంలో ఉన్న అపార అనుభవంతో ఎంవీఆర్ శాస్త్రి నిర్భయంగా నిజాలను వెలుగులోకి తీసుకువచ్చారని కొనియాడారు.

అధికారంలో ఉన్నవా రైనా, ఎంతటి ప్రభావశీలురై తప్పుచేసినప్పుడు వెనుకడుగు వేయకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు. ప్రజాస్వామ్యంలో మీడి యా పాత్ర ఎంత కీలకమనేది ఆయన తన కలం పదునుతో చూపించారని పేర్కొన్నారు. విలువల ఆధారంగా జర్నలిజం వృత్తి సాగించాలనే స్ఫూర్తికి ఎంవీఆర్ శాస్త్రి గొప్ప ఉదా హరణ అంటూ కొనియాడారు.

ప్రస్తుత సమాచార యుగంలో నిజాయతీ, విశ్వసనీయత అత్యంత ముఖ్యమని, ఆ విలువలను కాపాడటం ప్రతి పాత్రికేయుడి బాధ్యత అని గుర్తు చేశారు. కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, జస్టిస్ గోపాలం, మాజీ ఐఏఎస్ అధికారులు కష్ణారావు, అజయ్‌మిశ్రా, మెట్రో ఇండియా దినపత్రిక ఎడిటర్ వీజేఎం దివాకర్, జీ న్యూస్ ఎడిటర్ భరత్ తదితరులు పాల్గొన్నారు.

జర్నలిజం బాధ్యతనూ పెంచింది: ఎంవీఆర్ శాస్త్రి

అనంతరం ఎంవీఆర్ శాస్త్రి మాట్లాడుతూ పాత్రికేయ ప్రయాణం తనకు కీర్తిప్రతిష్ఠలు తీసుకురావడమే కాకుండా, మరింత బాధ్యతనూ పెంచిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు నడిచిన మార్గాన్ని మరింత నిబద్ధతతో కొనసాగిస్తానని వెల్లడించారు. ఈ ప్రయాణంలో తనకు తోడ్పడిన సహచరులు, కుటుంబ సభ్యులు, పాఠకులకు కృతజ్ఞతలు తెలిపారు.

జర్నలిజం ఎప్పటికీ సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తిగానే ఉండాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యమని పిలుపునిచ్చారు. పాత్రికేయ రంగంలో విశిష్ట సేవలు అందించిన వారిని సత్కరించడమంటే, సమాజంలో సానుకూల దృక్పథాన్ని విస్తరించడమేనని అభిప్రాయపడ్డారు.