10 May, 2026 | 1:22 AM

మాటలకందని త్యాగశీలి

10-05-2026 12:00 AM

నేడు మాతృ దినోత్సవం :

ప్రపంచంలో ప్రతి మనిషికి మొదటి గురువు, మొదటి స్నేహితురాలు, మొదటి దేవత వారి తల్లే. తల్లి ప్రేమకు ఎలాంటి ప్రతిఫలం ఉండదు. ఆమె తన పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. ఈ అపారమైన ప్రేమను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం మే నెల రెండవ ఆదివారం ‘మదర్స్ డే’ లేదా ‘మాతృ దినోత్సవం’గా జరుపుకొంటా రు. మాతృ దినోత్సవం అనేది ఒక పండుగ మాత్రమే కాదు; తల్లి చేసిన సేవలను గుర్తుచేసుకునే ప్రత్యేకమైన రోజు. ఈ రోజున పిల్లలు తమ తల్లులకు శుభాకాంక్షలు తెలియజేసి, బహుమతులు అందించి, ప్రేమా భిమానాలను వ్యక్తం చేస్తారు. 

అయితే తల్లిపై నిజమైన గౌరవం ఒక్క రోజుకే పరిమితం కాకూడదు. తల్లిని ప్రతిరోజూ ప్రేమతో, గౌరవంతో చూసుకో వాలి. తల్లి మన జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చిన్ననాటి నుంచి మన ఆరోగ్యం, చదువు, సంస్కారం, భవిష్యత్తు కోసం మన మాతృమూర్తి నిరంతరం కష్టపడుతుంది. తన సుఖాలను త్యజించి పిల్లల సంతోషానికే ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే భారతీయ సంస్కృతిలో ‘మాతదేవోభ వ’ అని పేర్కొన్నారు. అంటే తల్లిని దేవతలా భా వించాలని అర్థం.

ఈ ఆధునిక కాలంలో చాలా మంది ఉద్యోగా లు, ఇతర పనుల వల్ల కుటుంబానికి తగిన సమయం ఇవ్వలేకపోతున్నారు. అందుకే వద్ధాశ్రమా ల్లో నివసించే తల్లుల సంఖ్య పెరుగుతోంది. ఇది సమా జానికి ఆందోళన కలిగించే విషయం. మాతృ దినోత్సవం మనకు తల్లి దండ్రుల విలువను గుర్తుచేస్తుంది.

వారితో ప్రే మగా మాట్లాడటం, సమ యం కేటాయించడం, వారి భావాలను గౌరవించడం ప్రతి పిల్లవాడి బాధ్యత. తల్లి ప్రేమ ను మాటల్లో పూర్తిగా వివరించడం అసాధ్యం. ఆమె త్యాగం, సహనం, మమకారం అమూల్యమైనవి. కాబట్టి, మాతృ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ తల్లికి కృతజ్ఞతలు తెలియజేసి, జీవితాంతం ఆమెను గౌరవించాలని సంకల్పించాలి.

ఆళవందార్ వేణుమాధవ్

- వ్యాసకర్త: 8686051752