5 May, 2026 | 2:33 AM

సమకాలీన రాజకీయాల్లో సంచలనం

05-05-2026 01:10 AM
  1. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం
  2. విజయ్‌కు కేటీఆర్ అభినందనలు

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): సమకాలీన రాజకీయాల్లో సంచలనం అనే పదానికి అసలైన అర్థం తమిళనాడులో కనిపిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమిళనాడు ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్‌కు ఆయన ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘రాజకీయ రంగ ప్రవేశం చేసిన తొలి ప్రయత్నంలోనే అసాధారణ విజయం సాధించడం గొప్ప విషమన్నారు.

రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్న మూస పద్ధతులను, సంప్రదాయాలను పక్కన పెట్టి, సరికొత్త ఒరవడితో అద్భు తమైన మార్పును తీసుకొచ్చారు అని కొనియాడారు. విజయ్ నాయకత్వంలో తమిళ నాడు రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందని, మరింత శక్తివంతంగా మారుతుందని ఆకాంక్షించారు. తమిళనాడు ప్రజల తీర్పు రాజకీయాల్లో సరికొత్త ఆశలకు నాంది పలుకుతుందని కేటీఆర్ అన్నారు.