5 May, 2026 | 2:32 AM

సేంద్రియ ఎరువులు వాడాలి..

05-05-2026 01:08 AM

నేలతల్లి ఆరోగ్యం కాపాడాలి : ఎమ్మెల్యే రాగమయి

సత్తుపల్లి, మే 4 (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల అశ్వరావుపేట అసోసియేట్ డీన్ డా. జె. హేమంత కుమార్, శాస్త్రవేత్తలు డా. పి. నీలిమ, డా. ఎ. శ్రీజన్ సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి గ్రామంలో సోమవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా వ్యవసాయ దినోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్తుపల్లి శాసన సభ్యురాలు డాక్టర్  మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం, సిఫారసు చేసిన మేరకు ఎరువుల యాజమాన్యం, పంట మార్పిడి, సాగునీటి ఆదా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రైతులను కోరారు. కార్యక్రమానికి ఆచార్య డా. చల్లా వేణుగోపాల్ రెడ్డి, డా. జై హేమంత్ కుమార్,  డా. పి. నీలిమ,  సత్తుపల్లి మున్సిపాల్టీ  చైర్మెన్  రెహానా, వ్యవసాయ సహాయ  సంచాలకులు  శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ అధికారి వై. శ్రీనివాస రావు,  బేతుపల్లి సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్, ఉప సర్పంచ్ చెన్నకేశవులు, వ్యవసాయ విస్తరణాధికారి వాసంతి తదితరులు పాల్గొన్నారు.