calender_icon.png 18 September, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యేక ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేయాలి..

09-02-2025 05:58:06 PM

ఉత్తర తెలంగాణ అభివృద్ధి ఫోరం ఛైర్మన్  డాక్టర్ కేశవులు..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఉత్తర తెలంగాణ సమగ్రాభివృద్ధికీ ప్రభుత్వాలు సహకరించాలి, అందుకు గాను ప్రత్యేక ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేయాలని ఉత్తర తెలంగాణ అభివృద్ధి ఫోరం ఛైర్మన్ డాక్టర్ కేశవులు అన్నారు. రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న అధ్యక్షతన ఆదిలాబాద్ లో ఆదివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఫోరం ఛైర్మన్ డాక్టర్ కేశవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీల నేతలు, పట్టణ ప్రముఖులు ఉత్తర తెలంగాణ అభివృద్ధికి తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

ఈ సందర్భంగా డాక్టర్ కేశవులు మాట్లాడుతూ... ఉత్తర తెలంగాణలోని  ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జిల్లాల్లో అభివృద్ధికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. అడవులు, ఖనిజసంపద, పంట భూములకు కొదువ లేదని, సాగు, తాగునీరు కల్పించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నప్పటికి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. మెరుగైన రవాణా వ్యవస్థ ఉంటే పెట్టుబడులను ఆకర్షించడానికి వీలవుతుందని, రవాణా లేని ప్రాంతాలు ఏనాడూ అభివృద్ధి కావని గుర్తు చేశారు.