ఆకృతి ఎలైట్ వస్త్రోత్పత్తుల ప్రదర్శన
20-04-2024 12:20 AM
హైదరాబాద్, ఏప్రిల్ 19: గత కొన్నేళ్లుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ఆకృతి ఎలైట్‘ వస్త్రోత్పత్తుల ప్రదర్శన బంజారా హిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో ఈ నెల 19 నుంచి 21వరకు జరుగుతుంది.. ఈ ప్రదర్శనలో ఫ్యాషన్ దుస్తులతో పాటు పలురకాల ఆభరణాలు,గృహాలంకరణ ఉత్పత్తులు మహిళలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిపుణులైన ఉత్పత్తి దారులు అయా ప్రాంతాలలో పేరు గాంచిన ఉత్పత్తులను ఇక్కడ 60కి పైగా స్టాల్స్ లో ప్రదర్శిస్తారని ‘ఆకృతి ఎలైట్‘ నిర్వాహకురాలు శశి నెహతా తెలిపారు.






