25 మిలియన్లు దాటిన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రయాణీకుల సంఖ్య
20-04-2024 12:20 AM
హైదరాబాద్, ఏప్రిల్ 19: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఆర్‌జీఐఏ) నుంచి రాకపోకలు సాగించిన ప్రయాణీకుల సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంలో 25 మిలియన్లు దాటింది. 2023 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 21 మిలియన్ల ప్రయాణీకులకంటే ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ట్రాఫిక్ 19 శాతం వృద్ధిచెందినట్టు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రా తెలిపింది. దేశీయ ప్రయాణీకుల ట్రాఫిక్ 18.5 శాతం, అంతర్జాతీయ ప్రయాణీకుల ట్రాఫిక్ 23.2 శాతం పెరిగినట్టు పేర్కొంది.. 2023 డిసెంబర్ 23న అత్యధిక సంఖ్యలో 0.77 లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించినట్టు తెలిపింది.






