వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యకు పరిష్కారం..
కరకగూడెం, జూన్ 11 (విజయక్రాంతి): రానున్న వర్షాకాలంలో నీటి నిల్వ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కరకగూడెం గ్రామపంచా యతీ ముందస్తు చర్యలు చేపట్టింది. గ్రామంలోని మెయిన్ రోడ్డు పక్కన గతంలో వర్షపు నీరు నిల్వ ఉండి సమీప నివాసితులకు ఇబ్బందులు కలిగిన ప్రాంతంలో కాలువ తవ్వకం, పైపుల ఏర్పాటు పనులు నిర్వహించారు. ఈ పనులను సర్పంచ్ పోలేబోయిన సుజాత, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ బుధవారం పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసు కోవడం, సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించడం గ్రామపంచా యతీ లక్ష్యమని తెలిపారు. వర్షాకాలంలో నీటి నిల్వలు, దోమల వ్యాప్తి, వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిం చారు. ఈ చర్యలతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ గ్రామపంచాయతీ చొరవను అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, పోలే బోయిన పాపారావు, గ్రామస్తులు పాల్గొ న్నారు.






