28 July, 2026 | 2:23 AM

రెండు వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలి

28-07-2026 01:43 AM
  1. సిట్‌లో ఫోరెన్సిక్ ఆడిటర్‌ను చేర్చండి
  2. అయోధ్య విరాళాల చోరీ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ, జూలై 27: అయోధ్య విరాళాల చోరీ కేసును పారదర్శకంగా, సమగ్రంగా చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)లో ఫోరెన్సిక్ ఆడిటర్‌ను తప్పనిసరిగా చే ర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. అలాగే దర్యాప్తు పురోగతిపై కూడా రెండు వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సిట్‌ను న్యాయస్థానం ఆదేశిస్తూ డెడ్‌లైన్ విధించింది.

ఈ కేసు విచారణ కోసం ఐజీ కిరణ్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటుచేసినట్లు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేసు విచారణ వేగంగా, నిష్పాక్షికంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. సిట్ ఇచ్చే నివేదికను పరిశీలించాకే తదుపరి చర్యలపై నిర్ణ యం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది.