19-12-2025 12:00:00 AM
రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపోకు స్థలం కేటాయింపు
రైల్వే శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ
మానుకోటలో హర్షాతిరేకాలు
మహబూబాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి): రైల్వే మెగా మెయింటెనెన్స్ డి పోను మహబూబాబాద్ లోనే ఏర్పాటుకు అవసరమైన స్థలం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభు త్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పట్టణ శివారులోని అనంతారం పరిధిలో 238.06 ఎకరా ల మెట్ట భూమి, 170.35 ఎకరాల గుట్టలతో కూడిన భూమిని కలిపి మొత్తంగా 409.01 ఎకరాల భూమిని రైల్వే మెగా ప్రాజెక్ట్ కోసం ఉచితంగా ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చే స్తూ రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖ ప్ర త్యేక ముఖ్య కార్యదర్శి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కు ఈనెల 17న లేఖ ఇచ్చారని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూ క్యా మురళి నాయక్ తెలిపారు.
900 కు పై గా కోట్ల రూపాయలతో వరంగల్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య మెగా మె యింటినెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేం ద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ఫ్యాక్టరీని వరంగల్ ప్రాంతానికి తరలించే ప్ర యత్నాలు చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన వివిధ వర్గాలు, రాజకీయ పార్టీలు ఐక్యమత్యంగా ఏకతాటిపై నిలిచి గత కొద్దిరోజులుగా ఫ్యాక్టరీని మహబూబాబాద్ ప్రాంతంలోనే ఏర్పాటు చేయడానికి ఉద్యమాన్ని చేపట్టా యి.
ఈ క్రమంలో కేంద్రంలోని అధికార బీ జేపీ, రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ నా యకులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘా ల నాయకులు, వివిధ పార్టీల నేతలు సంఘటిత ఉద్యమానికి శ్రీకారం చుట్టడంతో పా టు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చాయి. మానుకోట లోనే రైల్వే మెగా ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారుడు, మ హబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎ మ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు కృషి చేశారు.
ఫలితంగా రైల్వే మెగా ప్రాజెక్టు కోసం స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మానుకోట ప్రాం తంలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నా యి. ఈ సందర్భంగా రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుకై అఖిలపక్ష ప్రజా సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత జూన్ నె ల నుండి ఈ యొక్క రైల్వే మెగా మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం వివిధ రకాల ప్రయత్నాలను చేయటం జరిగిందని,
ఒక వై పున రాష్ట్ర ప్రభుత్వం మరోవైపున రైల్వే సం బంధిత ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి మాట్లాడి వారి సూచనలు సలహాలు తీసుకున్నామన్నారు. ఈ క్రమంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సహకారంతో ప్రత్యేక శ్రద్ధతో ఈ ప్రక్రియను ముందుకు కొనసాగించడం జరిగిందని తెలిపారు.
ఈ క్రమంలో ప్రత్యేక పరిస్థితుల్లో భూ సర్వేలు నిర్వహించి సంబంధిత అనంతరం శివారులోని సుమారు 409 ఎకరాలలో ఏర్పాటు కు కోసం సర్వే చేపించడం జరిగిందని, ఇట్టి సర్వే వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా సౌత్ సెంట్రల్ రైల్వేజనరల్ మేనేజర్ కు రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ ద్వారా పంపించడం జరిగిందని తెలియజేశారు. స్థలం కేటాయింపుకు ప్రభుత్వం సంసి ద్ధత తెలపడంతో ఇక రైల్వే మెగా ఫ్యాక్టరీ ఎక్కడికి తరలిపోదని, అలా జరిగే ప్రయత్నాలు అన్నీ కూడా అడ్డుకుంటామని, అం దుకోసం అవసరమైన సందర్భాల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా మహబూబాబాద్ ప్రాంత అభివృద్ధికి ఈ డిపో ఏర్పాటుకు సహకరించాలని కోరారు.
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్ర త్యేక శ్రద్ధ పెట్టిన ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్, సహకారం అందించిన ఎంపీ పోరిక బలరాం నాయక్, సహకరించిన ఎ మ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావుకు అఖిలపక్షం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన నుంచి ప్రారంభం అయ్యేవరకు కలిసికట్టుగా కృషి చేద్దామని ప్రకటించారు.
ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి, సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్, కోఆర్డినేటర్ మైస శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలన్న, కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు గణపురపు అంజయ్య, ప్రజాసంఘాల నాయకులు గుగ్గిళ్ల పీరయ్య, పిల్లి సుధాకర్, కొండ్ర ఎల్ల య్య, బీమా నాయక్, రమేష్ నాయక్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకుడు కొత్తపళ్లి రవి, బీఎస్పీ నాయకుడు దార్ల శివరాజ్,
టిడిపి నాయకుడు ప్రేమ్చంద్ వ్యాస్, ఎం సి పి ఐ నేత కంచె వెంకన్న , మైనార్టీ నేత ఇక్బాల్, సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి, కాంగ్రెస్ నేతలు ఎండి ఖలీల్, ఎడ్ల రమేష్, సిపిఎం మాజీ ఫ్లోర్ లీడర్ సూర్ణపు సోమయ్య, ఆకుల రాజు, గు ణగంటి రాజన్న, పెరుగు కుమార్, దేశ పల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, పిడి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోనగిరి మధు, పి వై ఎల్ జిల్లా కార్యదర్శి బట్టు చైతన్య, మా మిండ్ల సాంబలక్ష్మి సామ పాపయ్య మనోజ్, సాయి కుమార్, బీమా నాయక్, సూర్య ప్రకాష్, దేవేందర్ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.