17 April, 2026 | 3:26 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

టేబుల్ టెన్నిస్ పోటీలకు ఐపీఎస్ విద్యార్థులు

20-12-2025 03:13 PM

విద్యార్థులను అభినందించిన పాఠశాల చైర్మన్ సంజీవ్ కుమార్,  ప్రిన్సిపల్ కృష్ణప్రియ

సుల్తానాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రస్థాయి ఎస్ జిఎఫ్ టేబుల్ టెన్నిస్ పోటీలకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో అక్టోబర్ నెలలో నిర్వహించిన  ఉమ్మడి జిల్లా స్థాయి 14 సంవత్సరాల బాలబాలికల టేబుల్ టెన్నిస్ పోటీలలో సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఈ వర్షిత,టి అభిజ్ఞ శ్రీ, ఏం సంప్రీత్ లు జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి ఈనెల 22 నుండి  24వ తేదీ వరకు హైదరాబాదు లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 

విద్యార్థుల ఎంపిక పట్ల పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియలు. హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, క్రీడల వల్ల విద్యార్థులు బంగారు భవిష్యత్తును నిర్మించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సత్యనారాయణ, శివ, సతీష్, మమత విద్యార్థులు పాల్గొన్నారు.