calender_icon.png 20 December, 2025 | 1:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ తప్పనిసరి

19-12-2025 12:00:00 AM

జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్ 

మెదక్, డిసెంబర్ 18(విజయక్రాంతి): జిల్లాలోని రేషన్ కార్డుదారులందరికీ జాతీయ ఆహార భద్రతా చ ట్టం కింద అర్హులైన లబ్దిదారులందరికీ ఈ - కేవైసీ ప్రక్రియ తప్పనిసరిగా అమలు చేయబడుతుందని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ కార్డుదారులు తమ ఈ కేవైసీ పూర్తి చేయకపోతే ఈ పోస్ యంత్రం ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయడం సాధ్యం కాదని అన్నారు. అయినప్పటికీ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో 205 కొంతమంది లబ్ధిదారులు ఈ కేవైసీ పూర్తి చేయలేదన్నారు. వెంటనే లబ్ధిదారులు రేషన్ షాపులలో ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని సూచించారు.