19-12-2025 12:00:00 AM
చేగుంట, డిసెంబర్ 18 : చేగుంట పట్టణ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ లను పొలంపల్లి పాస్టర్ రాజశేఖర్ ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి వారిని శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ ముజామిల్,కాంగ్రెస్ యూవ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, బాను తదితరులు పాల్గొన్నారు.