10 April, 2026 | 3:19 AM

సర్కారు బాయి చుట్టూ అల్లుకున్న కథ!

10-04-2026 01:25 AM

తెలంగాణ సామాజిక నేపథ్యంతో రాబో తున్న కొత్త సినిమా ‘సర్కారు బాయి’. శ్రీరామ్ నిర్మల, సాయి కీర్తన నాయకానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి లారా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లో బాహుబలి ప్రభాకర్, నాగ మహేశ్, దిల్ రమేశ్, చలాకీ చంటి, చిట్టిబాబు, శివాని రెడ్డి, నుపూర్ ముఖర్జీ, అదితి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

కే శివ సం గీత దర్శకత్వంలో రూ పొందుతున్న ఈ సినిమాకు గురువారం సికింద్రాబాద్ గణేశ్ మందిరం ఆవరణలో ముహూర్తం నిర్వహించారు. నిర్మాత తుమ్మల ప్రఫుల్ రామ్‌రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు లారా సీన్ డైరెక్షన్ చేశారు. ముహూర్తం షాట్‌కు తెలంగాణ ఇన్‌కామ్ ట్యాక్స్ ఆఫీసర్ దాస్య నాయక్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా డైరెక్టర్ లారా మాట్లాడుతూ.. “1985 సంవత్సరంలో జరిగిన నీటి సంఘటనలు, కుల వివక్షత వంటి అంశాలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం” అని చెప్పారు.

ప్రజల సమస్యలను ప్రతిబింబించే కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందుతుందనే నమ్మకాన్ని చిత్రబృందం వ్యక్తం చేసింది. ‘తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో వచ్చే సినిమాలను ఆదరించాల’ని ప్రముఖ దర్శకుడు ప్రేమ్‌రాజ్ పేర్కొన్నారు. ఈ నెలలోనే చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.