భావోద్వేగాల డైమండ్ డెకాయిట్
తెలుగులో రూపొందిన కొత్త చిత్రం ‘డైమండ్ డెకాయిట్’. ఇందులో పార్ధా గోపాల్ హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరించారు. మేఘనా రెడ్డి హీరోయిన్‌గా నటించారు. సూర్య జీ యాదవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంగీతం: పీఆర్; సినిమాటోగ్రఫీ: శివ అచంట; ఎడిటర్: శివ సర్వాణి. ఈ చిత్రం ఏప్రిల్ 10న ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటుచేసింది. ఈ ప్రెస్‌మీట్‌లో హీరో, నిర్మాత పార్ధా గోపాల్ మాట్లాడుతూ.. “డైమండ్ డెకాయిట్’ ప్రతి కు టుంబం కనెక్ట్ అయ్యేలా కథ ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విడుదల కానున్న థియేటర్లలో 4 షోలు మహిళలకు ఉచితంగా ప్రదర్శిస్తున్నాం” అని చెప్పారు. దర్శకుడు సూర్య జీ యాదవ్ మాట్లాడుతూ.. “33 ఏళ్ల క్రితం వచ్చి న మాతృదేవోభవ సినిమా తరహా భావోద్వేగాన్ని ఈతరం ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నమే ‘డైమండ్ డెకాయిట్” అని తెలిపారు.




