calender_icon.png 11 January, 2026 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంపన్న వాగులో జన ప్రవాహం

11-01-2026 01:30:17 AM

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రధానంగా భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరించడం ఆనవాయితీ. కాకతీయ రాజులతో జరిగిన యుద్ధంలో పరాజయ వార్త విన్న సమ్మ క్క కుమారుడు జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని చరిత్ర. మేడారం జాతర ప్రారంభమైన తర్వాత సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది.  మేడారం జాతరకు వచ్చే లక్షలాదిమంది భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరించి వాగు ఒడ్డునే ఉన్న జంపన్న గద్దె వద్దకు చేరుకొని మొక్కులు సమర్పిస్తారు.

ఆ తరువాత  సమ్మక్క సారలమ్మ గద్దెలను చేరుకుం టారు. దీనితో ౩ రోజులపాటు జంపన్న వాగు పొడవునా భక్తులు పుణ్యస్నాలు ఆచరి స్తారు. దీంతో 10 కిలోమీటర్లకు పైగా ఇసుకేస్తే రాలనంత జనసంద్రంగా జంప న్నవాగు మారుతుంది. జంపన్న వాగు లో పవిత్రస్నానం ఆచరించడానికి ప్రభు త్వం జాతర సమయానికి ముందు లక్నవరం నుంచి నీటిని విడుదల చేస్తుం ది. అలాగే రెడ్డిగూడెం నుంచి మొదలుకొని ఊరట్టామ్ వరకు వాగుపొడవునా ప్రత్యేకంగా బ్యాటరీటాప్స్ అమర్చి స్నాన ఘట్టాలను ఏర్పాటు చేస్తారు. భక్తులు దుస్తులు మార్చుకునే వసతి కల్పిస్తారు. అలాగే కళ్యాణ కట్టను కూడా ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడే భక్తులు తలనీలాలు కూడా సమర్పిస్తారు.