calender_icon.png 11 January, 2026 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు రోజుల మహానగరం!

11-01-2026 01:29:20 AM

మాఘశుద్ధ పౌర్ణమి ముందు రోజు వరకు దట్టమైన అటవీప్రాంతం.. కనుచూపుమేర ఎటు చూసినా జనంతో నిండి.. విద్యుత్ కాంతులతో దేదీప్య మాణంగా వెలుగొందుతూ మూడు రోజులపాటు మహానగరంగా మేడారం మారిపోవడం జరుగుతుంది. నిరుపేదల నుంచి మొదలుకొని కోట్లకు పడగలెత్తిన వారు సైతం తల్లులపై నమ్మికతో పిల్లాపాపలతో మే డారం తరలివస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు జాతరకు తరలి రావడంతో మేడా రం కీకారణ్యం మూడు రోజులపాటు జనారణ్యంగా మారుతుంది. రాష్ట్ర ప్రభు త్వం మేడారం గ్రామానికి సుమారు పది కిలోమీటర్ల విస్తీర్ణంలో నలుదిశలా భక్తుల విడిది కోసం తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పిస్తుంది.

దీంతో అరణ్యంలో భక్తులు గుడారాలు వేసుకుని జాతరలో సమ్మక్క సారలమ్మ దేవతలకు ప్రణమిల్లి మొక్కులు సమర్పించుకొని మళ్లీ రెండేళ్ల వరకు చల్లగా చూడాలంటూ తిరుగుముఖం పడతారు. మూ డు రోజుల జాతర కోసం రాష్ట్ర ప్రభు త్వం రూ.100 కోట్లకు తక్కువ కాకుండా ప్రతి జాతరకు భక్తుల సౌకర్యాల కోసం నిధులు ఖర్చుచేస్తోంది. జంపన్న వాగు కు ఇరువైపులా రహదారుల నిర్మాణంతోపాటు విద్యుత్ సౌక ర్యం కోసం ప్రత్యేకంగా సబ్‌స్టేషన్ నిర్మించి, క్షణం కూడా విద్యుత్ కోతలు లేకుండా ప్రత్యేకంగా గ్రిడ్ నుంచి విద్యు త్ సరఫరా చేస్తుంది. జాతరకు మూడు రోజులపాటు జనం తరలిరావడంతో మేడారం మహానగరంగా మారిపోతోంది.