విద్యుత్తు సమస్యల పరిష్కారానికి పోరాబాట!
- వైటీపీఎస్‌లో ప్రైవేటీకరణ ప్రయత్నాలపై ఆగ్రహం
- తెలంగాణ ఎలక్ట్రీసిటీ, పవర్ ఎంప్లాయీస్ జేఏసీలు
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): విద్యుత్తు సంస్థల్లో నెలకొన్ని సమస్యల పరిష్కారానికి పోరుబాట పట్టేందుకు విద్యుత్తు ఉద్యోగులు, కార్మిక సంఘాల జేఏసీలు సన్నద్ధమవుతున్నాయి. గురువారం తెలంగాణ ఎలక్ట్రీసిటీ ఎంప్లాయీస్ జేఏసీ, తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించాయి. ఇందులో ప్రధాన సమస్యలపై చర్చించి.. వివిధ డిమాండ్లతో ప్రకటనలను విడుదల చేశాయి.
1.4. 2026 నుంచి అమలు చేయాల్సిన పీఆర్‌సీపై వెంటనే ప్రభుత్వ ప్రకటన చేయాలని, ఇందుకోసం పీఆర్‌సీ కమిటీని ఏర్పాటు చేయాలని జేఏసీల నేతలు డిమాండ్ చేశారు. అలాగే యాదాద్రి థర్మల పవర్ స్టేషన్‌లో ప్రైవేటీకరణకు జరుగుతున్న ప్రయత్నాలను రెండు జాక్ లు ఖండిచాయి. వైటీపీఎస్‌లో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ), యాస్ హ్యాం డ్లింగ్ ప్లాంట్ (ఏహెచ్‌పీ), ఓ అండ్ ఎం కార్యకలాపాల ప్రైవేటీకరణ టెండర్లను వ్యతి రేకిస్తూ.. వెంటనే ప్రభుత్వం ఆ ప్రయత్నాల ను మానుకుని.. పిలిచిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే వైటీపీఎస్‌కు సరఫరా చేస్తున్న డీగ్రేడ్, లోగ్రేడ్ బొగ్గును నిలిపివేయాలన్నారు. నాణ్యమైన బొగ్గును సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాన ఎలక్ట్రీసిటీ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ రమేష్, కో చైర్మన్ పీ అంజయ్య, కన్వీనర్ ఎన్ శివాజీ, అడ్వైజర్ కోడూరి ప్రకాష్, కో కన్వీనర్ రాజా రవిచంద్ర తదితరులు ప్రకటన విడుదల చేశారు. అలాగే 1999 మధ్య కాలంలో భర్తీ అయిన ఉద్యోగులకు జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు.
మహారాష్ట్ర మోడల్ ప్రకారం రైతు డిస్కంను ఏర్పాటు చేయాలన్నారు. ఖాళీల భర్తీ, ఉద్యోగులకు రెగ్యులర్‌గా ప్రమోషన్లు లాంటి వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఛైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్‌రావు, సెక్రెటరీ శ్రీధర్, కో కన్వీనర్ బీసీరెడ్డి ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్‌కు అందజేశారు.






