తల్లి మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య
10-12-2024 01:07 AM
ఖమ్మం, డిసెంబర్ 9 (విజయ క్రాంతి): తల్లి మందలించిందని పదో తరగతి విద్యార్థిని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నది. ఖమ్మం మా మిళ్లగూడెంకు చెందిన నవీన్ బాబు, అనురాధ దంపతులకు కుమార్తె లక్ష్మీ నక్షత్ర (14) ఉన్నది. స్థానిక హార్వెస్ట్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నది. లక్ష్మీనక్షత్ర రోజు మధ్యాహ్నం స్కూలుకు వెళ్లి పరీక్షలు రాసి వస్తుంది. సోమవారం కాస్త ఆలస్యంగా ఇంటికి రావడంతో తల్లి మందలించింది. దీంతో మన స్థాపం చెందిన విద్యార్థిని ఇంటికి దగ్గర్లోని వాణి ఐటీఐ కాలేజ్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది.






