4 May, 2026 | 3:01 AM

గుంతలమయంగా కేవోసీ రోడ్డు

10-12-2024 01:07 AM

పట్టించుకోని సింగరేణి అధికారులు

ఇల్లెందు, డిసెంబర్ 9 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం టేకులపల్లి మండలంలో సింగరేణి కోయగూడెం ఉపరితల గని(కేవోసీ) ఉంది. ఇక్కడి నుంచి నిత్యం వందల సంఖ్యలో లారీ లు బొగ్గు లోడుతో ప్రయాణిస్తుంటాయి. దీంతో టేకులపల్లి నుంచి బోడు వెళ్లే మార్గం లో పెట్రాంచెలక స్టేజీ వరకు (పది కిలోమీటర్లు) రోడ్డంతా గుంతలమయమైంది.

అది ఆర్‌అండ్‌బీ రోడ్డు కానీ.. సింగరేణి నుంచి బొగ్గు రవాణా అవుతుండటంతో దాని నిర్వహణను సింగరేణికే అప్పగించారు. అధికా రులు తూతూ మంత్రంగా గుంతలు పూడ్చి చేతులు దులుపుకున్నా వారంలోనే గుంత లు ప్రత్యక్ష్యమై లారీల్లోంచి బొగ్గు పెల్లలు పడుతున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.