calender_icon.png 28 January, 2026 | 2:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తంగళ్ళపల్లిలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ మీటింగ్ నిర్వహణ

28-01-2026 12:06:00 AM

తంగళ్ళపల్లి,జనవరి 27 (విజయ క్రాంతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ మీటింగ్ నిర్వహించారు. వేసవికాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలపై చర్చించారు. గ్రామాల్లో నీటి సరఫరా నిరంతరంగా ఉండేలా ప్రణాళిక రూపొందించాలని ఎంపీడీవో సూచించారు. బోర్లు, హ్యాండ్పంపులు, వాటర్ ట్యాంకుల మరమ్మతులు సకాలంలో చేపట్టాలని, అవసరమైన చోట తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సమావేశంలో గ్రామ సర్పంచులు, గ్రామ సెక్రటరీలు తదితర అధికారులు పాల్గొన్నారు.