calender_icon.png 28 January, 2026 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయులు ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలను సాధించాలి

28-01-2026 02:29:06 PM

ఎంఈఓ వై.తిరుపతి రెడ్డి

నిజాంసాగర్,(విజయక్రాంతి): మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అచ్చంపేట్ లో బుధవారం పాఠశాలల ప్రాథమిక స్థాయి పాఠశాలల సముదాయాల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి వై.తిరుపతి రెడ్డి మాట్లాడుతూ... ఉపాధ్యాయులు ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలకు అనుగుణంగా విద్యాబోధన చేసి విద్యార్థులను ఈ సామర్ధ్యాలలో రాణింపజేయాలని ఆయన అన్నారు.

మిడ్ లైన్ టెస్ట్ కు సంబంధించి స్కూల్ వారిగా, తరగతి వారీగా విద్యార్థుల ప్రతిభను పరీక్షించి ఎండ్లైన్ పూర్తి అయ్యే వరకు ఉపాధ్యాయులు లక్ష్యాలను చేరుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. సబ్జెక్ట్ వారిగా మండల్లోని పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన ర్యాంకులను వివరించారు. కాంప్లెక్స్ సమావేశాలలో ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి ఫోనిక్స్ అనే అంశంపై  నర్సింగరావు పల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ప్రనిష మాదిరి పాఠంశాని బోధించారు.

ఈ కార్యక్రమంలో అచ్చంపేట్ కాంప్లెక్స్ ప్రధానో ప్రధానోపాధ్యాయులు వెంకటరామిరెడ్డి. ప్రభుత్వ హై స్కూల్ నిజాంసాగర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎ.వెంకటేశం సిఆర్పిలు బి.శ్రీధర్ కుమార్, ఎం. వరలక్ష్మి, పి నర్సింలు, కాంప్లెక్స్ పరిధిలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.