calender_icon.png 28 January, 2026 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఢిల్లీ’ చైన్ స్నాచర్ల అరెస్టు

28-01-2026 12:06:53 AM

హయత్‌నగర్, నాగోల్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా చైన్ స్నాచింగ్

మహిళలు అప్రమత్తంగా ఉండాలి : డీసీపీ అనురాధ

ఎల్బీనగర్, జనవరి 27: హయత్‌నగర్, నాగోల్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా చైన్ స్నా చింగ్ పాల్పడిన ఢిల్లీ దొంగలను మంగళవారం చైతన్యపురి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తర లించినట్లు ఎల్బీనగర్ డీసీపీ అనురాధ తెలిపారు. ఈ మేరకు మంగళ వారం తన కార్యాలయంలో కేసు వివరాలను డీసీపీ అనురాధ వెల్లడించారు. సంక్రాంతి పండుగ అనం తరం ఎల్బీనగర్ డీసీపీ జోన్ పరిధిలో మూడు చైన్ స్నాచింగ్, ఒక చైన్ స్నాచింగ్ అటెంప్ట్ చేశారు.

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులను మూడు బృందాలుగా ఏర్పా టు చేసి, టెక్నికల్ ఎవిడెన్స్ సహాయంతో  అక్షయ్ కుమార్ శర్మ, రో హిత్ అనే ఇద్దరు నిందితులను  ఢిల్లీ లో అదుపులోకి తీసుకున్నారు. నిం దితుల వద్ద నుంచి బంగారంతోపాటు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా  డీసీపీ అనురాధ మాట్లాడుతూ దొంగతనాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.