28-01-2026 01:27:14 PM
ఘట్ కేసర్, జనవరి 28 (విజయక్రాంతి) : ఘట్టుమైసమ్మ జాతర హుండీ డబ్బులను ఆలయ ఆవరణలో లెక్కించారు. ఈనెల 25న ఆదివారం జరిగిన అమ్మవారి జాతరలో భక్తులు సమర్పించుకున్న హుండీల ఆదాయం రూ. 1లక్షల 77 వేల 581 వచ్చినట్లు దేవాదాయ ఇన్ స్పెక్టర్ ప్రణీత్ కుమార్, ఆలయ కార్యనిర్వాహన అధికారి ఎల్. భాగ్యలక్ష్మి తెలిపారు. మాజీ ప్రజాప్రతినిధులు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు, కులసంఘాల నాయకులు, గ్రామపెద్దల సమక్షంలో హుండీలను తెరచి డబ్బులను లెక్కించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిండ్ల ముత్యాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్, నాయకులు బొక్క ప్రభాకర్ రెడ్డి, ప్రసాద్, బొక్క సత్తిరెడ్డి, ఎం. శ్రీనివాస్, నూతన కమిటీ డైరెక్టర్లు, కుల సంఘాల నాయకులు , దేవాదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.