calender_icon.png 28 January, 2026 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి తల్లిదండ్రులను చంపిన నర్స్‌

28-01-2026 01:55:10 PM

హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలోని బంట్వారం మండలం యాచారం గ్రామంలో ఒక యువతి, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని ఆగ్రహించిన కూతురు తన కన్నతల్లిదండ్రులను హత్య చేసిన దారుణం వెలుగులోకి వచ్చాయి. పోలీసు వర్గాల ప్రకారం, ఎన్. సురేఖ అనే ఆ మహిళ కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తితో సంబంధం కొనసాగిస్తోంది. సురేఖ తల్లిదండ్రులు కులాంతర వివాహానికి అంగీకరించలేదు. దీంతో ప్రియుడి కోసం కన్నవారిని కడతేర్చేందుకు పథకం వేసింది. తాను పనిచేస్తున్న నర్సింగ్ హోం నుండి అనస్థీషియా తీసుకొచ్చి ఒళ్లు నొప్పులకు మందు అంటూ అధిక డోసేజ్ మత్తు మందు కలిగిన ఇంజెక్షన్లు యువతి తల్లిదండ్రులకు ఇచ్చింది. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత సహజ మరణమని అన్నకు విషయం చెప్పింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించింది.