29 July, 2026 | 9:39 PM

Breaking News

మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •   గురుపౌర్ణమి సందర్భంగా సామూహిక ధ్యానం   •   ఆర్మూర్ ఎంఈవోగా రాజేశ్వర్   •   ఏజెన్సీలో భారీ వర్షాలు.. గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్   •   భిక్కనూర్ పీహెచ్‌సీలో వైద్య సేవలపై డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ   •   సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •  

నిస్వార్థ ప్రేమకు చిహ్నం

14-11-2024 12:00 AM

కొన్ని చిత్రాలు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ అలా గుర్తుండిపోతా యి. అలాంటి చిత్రమే షారుఖ్ ఖాన్, ప్రతీ జింటా జంటగా నటించిన ‘వీర్ అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం. 20 ఏళ్ల క్రితం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అద్భుతమైన ప్రేమకథగా రూపొందింది. యశ్ చోప్రా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా అప్పట్లో అవార్డును అందుకుంది.

2004 నవంబర్ 12న ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో బాక్సాఫీస్‌ను గడగడలాడించింది. బుధవారానికి ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తున సందర్భంగా ప్రీతి జింటా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. “వీర్ జారాకు 20 ఏళ్లు. నాకు మాత్రం నిన్ననే విడుదలైనట్టుగా అనిపిస్తోంది.

ఈ సినిమా నిస్వార్థ ప్రేమకు చిహ్నంగా నిలిచిం ది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న ఈ సినిమాలో నటించడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఈ చిత్రం ఎప్పటికీ నాకు ప్రత్యేకమే‘ అని ప్రీతి జింటా తెలిపారు. ఈ సినిమాలో అమితా బ్ బచ్చన్, రాణి ముఖర్జీ, అనుపమ్ ఖేర్, హేమా మాలిని తదితరులు కీలక పాత్రలు పోషించారు.