29 July, 2026 | 8:33 PM

Breaking News

ఓటరు జాబితా సవరణలో బూతుల ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలి   •   బురద రోడ్డులో ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సు   •   ఘనపూర్ ఆయకట్ట వద్ద గంగామాతకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •   ఎల్‌నినో ప్రభావం...ఆయిల్ ఫామ్ ఆరుతడి పంటలపై దృష్టి   •   మధుర దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి   •   గుండ్ల మాచునూర్‌కు మినీ స్టేడియం కేటాయించాలి   •   లక్కీ డ్రా తీసి గిఫ్ట్ ఇస్తాం.. అంటే ఫోన్ నెంబర్ ను ఇవ్వకండి   •   ఎడతెరిపి లేని వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   భారతి నాట్యాలయంలో ఘనంగా గురుపూజోత్సవం   •   రానున్న రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •  

రాముడిగా చూపిస్తారట..

14-11-2024 12:00 AM

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం గురించి ప్రచారం అయితే బీభత్సంగా జరుగుతోంది. సినిమా గురించి రోజు కో రూమర్ వినిపిస్తోంది. అవి ఎంతవరకూ నిజమో తెలియ దు కానీ సినిమాపై అంచనాలు అయితే భారీగా పెంచుతున్నా యి. ఈ చిత్రానికి కథను అందిస్తున్న విజయేంద్రప్రసాద్ అయితే సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉంటుందని స్పష్టం చేశారు.

అయితే ఈ సినిమా కథ వారణాసి బ్యాక్ గ్రౌండ్‌లో ప్రారంభమవుతుందంటూ ప్రచారం జరుగుతోంది. మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఇది మరింత ఆసక్తికరం. చిత్రంలో మహేశ్‌ను ఏదో ఒక సీన్‌లో రాజమౌళి రాముడిగా చూపిస్తారంటూ టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో ఈ ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తుందని కూడా ప్రచారం చేస్తున్నారు.

ఇండియా జోన్స్ తరహాలో గుప్త నిధుల వేట అలాగే అంతుచిక్కని రహస్యాలను ఎన్నింటినో సినిమాలో చూపిస్తారట. ఈ క్రమంలోనే హిందూ దేవాలయాలకు సంబంధించిన అంశాలు కూ డా కొన్ని ఉంటాయట. వాటిలోనే మహేశ్ రాముడిగా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజమెంతుందో తెలియదు కానీ కావల్సినంత ఆసక్తిని రేకెత్తించేలా అప్‌డేట్స్ ఉన్నాయి.