calender_icon.png 9 February, 2026 | 9:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు టాలెంట్ టెస్ట్

09-02-2026 12:00:00 AM

చిట్యాల, ఫిబ్రవరి 8 : చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు చిట్యాల ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాస్థాయి టాలెంట్ టెస్టును  స్థానిక సరస్వతి జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని చిట్యాల పట్టణం లో ఉన్న గ్రిన్ గ్రోవ్ , లయోలా, ఆక్స్ఫర్డ్, న్యూ లిటిల్ ఫ్లవర్, పాఠశాలల నుండి ఈ టాలెంట్ టెస్ట్ కు విద్యార్థులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో పోటీతత్వం ఉండాలని, ప్రతి ఒక్కరు పోటీ పరీక్షలకు అవసరమయ్యే విధంగా చిన్నతనం నుండే జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి  పోటీ తత్వం అలవర్చుకోవాలని విద్యార్థులకు తెలిపారు. భవిష్యత్తులో ప్రతి పోటీ పరీక్షకు హాజరై తమ యొక్క విజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఎస్‌ఎఫ్‌ఐ చిట్యాల మండల కార్యదర్శి అరూరి ప్రణీత్, శశి కుమార్, మత్స్యగిరి, మనోజ్, రాము, శివ, పాఠశాలల ఉపాధ్యాయులు కందుల గణేష్ , కూనురు మధు , చరణ్, లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.