09-02-2026 12:00:00 AM
జిల్లా ఎన్నికల అధికారి కుమార్ దీపక్
బెల్లంపల్లి, ఫిబ్రవరి 8: మున్సిపల్ ఎన్నికలను ఎలాంటి పొరపాట్లు లేకుండాపకడ్బందీ గా నిర్వహించాలనీ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం బెల్లంపల్లి మండల కేంద్రంలో గల ఎస్.ఎం. ఫంక్షన్ హాల్ లో మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో పి.ఓ., ఎ.పి.ఓ. లకు నిర్వహించిన శిక్షణకార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. పోలిం గ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
11న పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, 12 రీపోలింగ్ (ఏమైనా ఉన్నట్లయితే), 13న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందన్నారు. ఎన్నికలలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని, అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల విధులలో నిర్లక్ష్యం వహించినట్లయితే ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం చర్య లు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సందర్శించి నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో ఏర్పా టు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను మంచిర్యాల ఆర్ డీ ఓ శ్రీనివాస్ రావుతో కలిసి సందర్శించి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. సి.సి. కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ పారదర్శకంగా నిర్వహించాలి
నస్పూర్: మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11న జరుగనున్న పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో పి.ఓ., ఎ.పి.ఓ. లకు నిర్వహించిన శిక్షణకార్యక్రమానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్ తో కలిసి హాజరై ఆయన మాట్లాడారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 ఓటర్లకు మించకుండా పోలింగ్ జరిగేలా ఏర్పాట్లు చేశామని, ప్రతి పోలింగ్ కేంద్రంలో కేటాయించిన సిబ్బందికి పోలింగ్ ప్రక్రియలోని ప్రతి అంశం తెలిసి ఉండాలని, ఓటింగ్ కంపార్ట్మెంట్‌గోప్యత నిర్వహణ సక్రమంగా చేయాలన్నారు.
ఇతరులకు బదులుగా ఓటు వేయడం, ఒకటికి మిం చి ఓటు వేయడం జరుగకుండా అన్ని జాగ్రత్త లు పాటించాలని, పోలింగ్ ముగిసిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవ లసిన నియమాలపై వివరించారు. పోలింగ్ నిర్వహణ ప్రక్రియలో పొరపాట్లకు తావు లేకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించా రు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క రూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.