calender_icon.png 2 February, 2026 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జవాన్ మహేశ్‌కు కన్నీటి వీడ్కోలు

28-07-2024 12:34:36 AM

  1. సైనిక లాంఛనాలతో అంతిమయాత్ర 
  2. తరలివచ్చిన అశేష జనం

నల్లగొండ, జూలై 27 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా అనుముల మండలం మదారి గూడేనికి చెందిన జవాన్ ఈరేటి మహేశ్ (24) అస్సాంలో శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందాడు. తోటి జవాన్లు శనివారం మహేశ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. 14వ మైలు క్రాస్ రోడ్డు వద్దకు రాగానే భారీగా ప్రజలు వాహనం వద్దకు వచ్చారు. మహేశ్ మృతదేహానికి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుం దూరు జైవీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ నివాళి అర్పించారు. అనంతరం అశేష జనవాహిని నడుమ సైనికులు లాంఛనాలతో మహేశ్ అంతిమయాత్రగా నిర్వహించారు. మహేశ్ తండ్రి యాదయ్య కుమారుడి చితికి నిప్పంటించారు.