2 May, 2026 | 1:51 AM

కుట్టుమిషన్ల పంపిణీలో అవినీతి దారం?

02-05-2026 12:43 AM
  1. గతానుభవాల దృష్ట్యా పారదర్శకంగా టెండర్లు నిర్వహించాలని డిమాండ్
  2. మార్గదర్శకాలను పటిష్ఠంగా అమలు చేస్తేనే అక్రమాలకు దూరం
  3. రైతు బంధులాగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమచేస్తే వివాదాలకు ఫుల్‌స్టాప్!

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొత్త పథకం

నియోజకవర్గానికి వెయ్యి చొప్పున కుట్టుమిషన్ల పంపిణీపై అప్పుడే అనుమానాలు

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి కుట్టుమిషన్ల పంపిణీపై అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. రూ.కోట్లు పక్కదారి పట్టించేందుకే ఇలాంటి పథకాలను తీసుకొస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. గతంలో పలు పథకాలను అమలు చేసే సందర్భంలో టెండర్ల నుంచి మొదలుకుని లబ్ధిదారుల ఎంపిక వరకు తీవ్ర విమర్శలు వచ్చిన సందర్భాలను వారు ఎత్తిచూపుతున్నారు. తాజాగా ప్రతి ని యోకవర్గానికి వెయ్యి కుట్టుమిషన్లను అందిస్తామంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ ప్రకటించిన నేపథ్యంలో అం దరిలోనూ మరోసారి చర్చను రేకెత్తించింది. ఈ పథకంలోనూ అవినీతి, అక్రమాలు జరుగుతాయని కొందరు చర్చించుకుంటున్నారు.

గతంలో పలు కొత్త పథకాలు అమలు చేయడంలో వచ్చిన ఆరోపణలు, లబ్ధిదారుల ఎం పిక, టెండర్ల ఎంపికలో వెల్లువెత్తిన అక్రమాలు, అవినీతి ఆరోపణలు వచ్చిన నేప థ్యంలో కుట్టుమిషన్ల పంపిణీలో ఇలాంటి వాటికి ఆస్కారం ఉండకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ సందర్భంగానే రాజకీయ విశ్లేషకులు, మేధావులు, ప్రజలు పలు సూచనలు చేస్తున్నారు. బీసీల్లోని నిరుపేదలకు కుట్టుమిషన్లన అందిం చాలనేది అందరూ స్వాగతిస్తున్న అంశమే.

అయితే ఇలా కుట్టుమిషన్లను అందించే ప్రక్రియలో పారదర్శకత, మార్గదర్శకాల అమలు పైనే అందరూ చర్చిస్తూ అవినీతి, అక్రమాలకు ఇక్కడే శ్రీకారం చుడతారనే అనుమానా లను వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకుగాను ఒక్కో నియోజవర్గానికి వెయ్యి కుట్టుమిషన్లను అందించి.. బీసీ నిరుపేద కుటుంబాలకు ఉపాధిని పెం పొందించేలా చూడటానికి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కుట్టుమిషన్ల పంపిణీని చేపట్టనున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.20 లక్షల కుట్టుమిషన్లను పం పిణీ చేయనున్నారు.

పారదర్శకంగా టెండర్లు

వాస్తవానికి టెండర్ల విషయంలో ఏదైనా అవినీతికి ఆస్కారం కలుగుతుంది. టెండరుదారుల అర్హతలను నిర్ణయించ డమే ఈ అక్రమాలకు శ్రీకారం చుడుతుంది. గతంలోలాగా ఆంధ్రాకు చెం దిన బడా కాంట్రాక్టర్లకు ఈ టెండర్లు దక్కేలాగా అర్హతలు ఉండకుండా కనీసం ఐదారు గురికి అదీ తెలంగాణవారికి టెండర్లు వచ్చేలాగా అర్హతలను నిర్ణయిస్తే అవినీతికి ఆస్కా రం లేకుండా ఉంటుందని మేధావులు సై తం అంటున్నారు. అలాగే కుట్టుమిషన్లను సరఫరా చేసేవారిలో ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) వారికికూ డా అవకాశం దక్కేలా చూడాలని వారంటున్నారు. దీంతోపాటు మహిళా వ్యాపారవే త్తలకు, 25 శాతం ఎస్సీ వ్యాపారవేత్తలకు టెండర్లు దక్కేలా మార్గదర్శకాలు రూపొందిస్తే స్థానికులకు వ్యాపార అవకాశాలు ఇచ్చి నట్టవుతుందని వారంటున్నారు.

ధర విషయంలో స్పష్టత

ఇక ఒక్కో కుట్టుమిషన్‌కు ధర ఎంత అనే ది నిర్ణయించడంలోనే అసలైన ఆరోపణలు వస్తాయని వారు సూచిస్తున్నారు. బహిరంగా మార్కెట్‌లో ఒక్కో కుట్టుమిషన్ ధర కంటే 1.20 లక్షల కుట్టుమిషన్లకు తక్కువ ధరకే వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం టెండరుదారులతో సమావేశం ఏర్పాటుచేసి ఎవరు తక్కువ ధరకు ఇస్తే వారికి టెండర్లు ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి (బీసీ సంక్షేమం) నిధులు మిగులుతాయని వారంటున్నారు. అలా కాకుండా గతంలో అనేక పథకాల విషయంలో జరిగినట్టుగానే ధరలను రెట్టింపు చేసి ప్రజా ధనాన్ని లూటీ చేసేలా లోపాయికారీ ఒప్పందాలకు వెళ్లకుండా చూడాలని వారం టున్నారు.

ఇలా జరిగితే ప్రభుత్వంపై మరోసారి అవినీతి, అక్రమాల ఆరోపణలు, విమ ర్శలు రావడం ఖాయమని, దీనివల్ల ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి తలెత్తి అంతి మంగా ప్రభుత్వానికే నష్టం వాటిల్లుతుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. దీనికితోడు లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత అవసరమని ప్ర జలు అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇతర పథకాల లబ్ధిదారుల ఎంపికలో వచ్చినట్టుగా అవినీతి ఆరోపణలు రాకుండా ఉండేలా బీసీల్లో ఉన్న కిందిస్థాయి వర్గాల నుంచి ఎంపిక జరగాలని వారంటున్నారు. రాజకీయ పక్షాల ప్ర భావం ఉండకుండా.. పారదర్శకంగా ఎంపిక ఉండాలని ప్రజలు కోరుతున్నారు.

రైతు బంధులాగా డీబీటీ.. 

రైతు బంధులాగా నేరుగా బెనిఫిట్ ట్రా న్స్‌ఫర్ (డీబీటీ) విధానం అయితే మరీ మం చిదని మేధావులు సూచిస్తున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసి వారి బ్యాంకు ఖాతా ల్లోకి కుట్టుమిషన్‌కు నిర్ణయించిన ధర మొ త్తాన్ని బదిలీ చేస్తే ప్రభుత్వం గుర్తించిన టెండరుదారుల నుంచి వారే నేరు గా కుట్టుమిషన్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుం ది. పైగా లబ్ధిదారుల అవసరాలమేరకు సొంతంగా మరికొం త డబ్బు కలిపి కొత్త కొత్త సౌకర్యాలతో ఉన్న కుట్టుమిష న్లు కొనుగోలు చేసుకునే అవకాశాం కల్పిస్తే మరింత ఉపయుక్తంగా ఉం టుందని ప్రజలు అంటున్నారు.

ఇదీ కాకుం డా రాష్ట్రం మొత్తం ఒకరిద్దరు కాంట్రాక్టర్లకు అప్పజెప్పకుండా మొత్తం 33 జిల్లాలకు ఒకరిద్దరి చొప్పున కుట్టుమిషన్ల సరఫరాదారు లు ఉండేలా జాగ్రత్త వహిస్తే మరింత పారదర్శకంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకు లు అభిప్రాయపడుతున్నారు. జిల్లాల వారీ గా కాంట్రాక్టర్లను ఎంపికచేస్తే స్థానికంగా ఉండే ఎంఎస్‌ఎంఈలకు అవకాశంగా ఉం టుందని వారంటున్నారు. ఇక ప్రభుత్వం ఏం చేస్తుందో.. ఎలా చేస్తుందో.. చూడాలి..!

వంద కోట్ల ఖర్చు

అంతంత మాత్రంగానే ఉన్న బీసీ సంక్షే మ శాఖ బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.20 లక్షల కుట్టుమిషన్ల పం పిణీ కోసం సుమారు రూ.100 కోట్ల వరకు ఖర్చు పెట్టాలనే ఆలోచనతో ప్ర భుత్వం ముందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఒక్కో కుట్టుమిషన్‌కు సుమారు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాస్త అధునాతన సౌకర్యాలతో ఉండే కుట్టుమిష న్లను ఎంపిక చేసుకుంటే మరింత ఎక్కు వ ధర ఉండే అవకాశం ఉంది. మొత్తం గా సుమారు రూ.100 కోట్ల వరకు ఖర్చు చేసే ఈ కుట్టుమిషన్ల పంపిణీలో అవినీతికి, అక్రమాలకు తావీయకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.