పోతిరెడ్డిపాడు నీటి అక్రమ తరలింపును తక్షణమే అడ్డుకోవాలి
బీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకులు,మాజీ జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి
హుజూర్ నగర్,ఆగస్టు 14: కెఆర్‌ఎంబి అనుమతి లేకుండా అక్రమంగా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడ్ హెడ్ రెగ్యులేటర్ నుండి అక్రమ నీటి తరలింపును తెలంగాణ ప్రభుత్వం ఆపాలని మా జీ జెడ్పిటిసి, హుజూర్ నగర్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ నాయకులు కొప్పుల సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడారు...
పోతిరెడ్డిపాడు నీటి తరలింపుతో భవిష్యత్తులో సాగర్ ఎడమ కాలువ క్రింద రైతాంగానికి తీవ్రమైన అన్యాయానికి గురి అవుతారని అందుకు వ్యతిరేకంగా ఉద్యమనేత కెసిఆర్ నాడే కోదాడ నుండి సాగర్ వరకు పాదయాత్ర చేసి నిరసన తెలిపారని,మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కృష్ణానది పైన ఉన్న ప్రాజెక్టుల ను ఇటీవల క్షేత్ర స్థాయిలో పరిశీలించారని,శ్రీశైలం ప్రాజెక్టు నీరు ఎనిమిది వందల రెండు అడుగుల వద్ద ఉన్నప్పుడే నార్లపూర్ రిజర్వాయర్ కల్వకుర్తి రిజర్వాయర్ కు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు నీరు అందించే అవకాశం ఉన్న కాంగ్రెస్ సర్కార్ నీటిని తరలించకుండా పరోక్షంగా ఏపీ ప్రభుత్వ అక్రమనీటి ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ రైతుల ప్రయోజనాలను చంద్రబాబు పాదాల చెంత రేవంత్ రెడ్డి సర్కార్ తాకట్టు పెట్టిందని ఆరోపించారు.
గత కెసిఆర్ పాలనలో రాష్ట్ర మంత్రి వర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి నాయకత్వంలో నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీలో ఉన్నప్పటికీ వారబంది పద్ధతిలో సాగు నీటిని వదిలి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు.కెఆర్‌ఎంబి అనుమతి లేకుండా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 50 టీఎంసీల నీటిని అదనంగా వాడుకుంటే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడం లేదని విమర్శించారు.
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించి శ్రీశైలం నుండి 40 టీఎంసీల నీటిని తీసుకుని సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు కింద రైతాంగానికి వారబందీ పద్ధతిలో నీటిని విడుదల విడుదల చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో డాక్టర్ కేఎల్ ఎన్ రెడ్డి,బెల్లంకొండ అమర్,గవిని లింగస్వామి బిఆర్‌ఎస్ నాయకులు పచ్చిపాల ఉపేందర్, సారెడ్డి భాస్కర్ రెడ్డి షేక్ అలీ,చంటి ములకలపల్లి రాంబాబు,నగేష్ రాథోడ్,తదితరులు పాల్గొన్నారు.






