17 April, 2026 | 2:13 AM

తాటి చెట్టుపైనే గీత కార్మికుడి మృతి

07-02-2026 01:00 AM

తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో ఘటన  

తంగళ్లపల్లి, ఫిబ్రవరి 6 (విజయ కాంత్రి) : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రా మంలో విషాద ఘట న చోటుచేసుకుంది. కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కిన సాయి కిషన్ (గౌడన్న) అనే గీత కార్మికుడు చెట్టుపైనే అకస్మాత్తుగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు ఆయనను కిందకు దింపేందుకు ప్ర యత్నించినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.